Friday, March 17, 2017

నాన్నంటే . ?

 కనిపించేదైవం నాన్న
నడిపించే నేస్తం నాన్న
కలనైనా స్వార్థమెరుగని
కల్పతరువు నాన్న!

యెదలోతుల్లో దుఃఖం
 యేరులయి పారుతున్న
 కన్నీరు కనుకొలుకుల జారనీకుండా
 కొసపంటికింద అదిమి పట్టే గొప్ప సాహసికుడు నాన్న

 అంతరంగమందు లావా
అలజడి రేపుతున్నా
 యెగిసి పడకుండా ఒడిసి పట్టి
నిగ్రహించుకు నిలబడే ధీనగమే నాన్న . !

తను(వు)ఎండల మాడుతున్న
తనవారికి నీడనందించి
తనువు జిగి సచ్చి సైసుమన్నా
పండ్లనందించ తనపడే తరురాజమే నాన్న . !

తన మదిలోని బాధల
అగాథపు లోతుల్నీ
తనువులో దాచుకుని
కనుగవ గంభీరతను చాటు కడలే నాన్న . !

తనువణువణువూ
 ఆటుపోటులతో అతలాకుతలమవుతున్నా
తన వారందరినీ సాగరపు
టలలపయి ఓలలాడించే ఆదర్శమూర్తి నాన్న . !

తను(వు)పొరలలో
కన్నీటి కాలువలు పారుతున్నా
తనువు పయి తరువులను
నిలిపే సహనశీలధరణే నాన్న . !

నాన్నంటే ఆదరణ !

నాన్నంటే ఆలంబన !

నాన్నంటే ఆవేశం మాటున దాగిన  ఆప్యాయత . !
                              -రాజశేఖర్ పచ్చిమట్ల

3 comments:

అన్యగామి said...

నాన్న వైభవం మీద మీ కవిత బావుంది. నాన్న మకుటంగా ఉన్న వాక్యములన్నింటిని మంచి పదాలతో జత కుదిర్చారు.

రాజశేఖర్ said...

కృతజ్ఞతలండీ

రాజశేఖర్ said...

నా కవితలు చదివి నన్ను ప్రోత్సహిస్తున్నవారందరికి కృతఙ్ఞతలు